
ప్రణయ్ పరువు హత్య కేసులో సంచలన తీర్పు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు, అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్కు బెయిల్ మంజూరు చేసింది.
గతంలో ఈ కేసులో శ్రవణ్ కుమార్కు జీవిత ఖైదు విధించగా, ఆ శిక్షను సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై తుది విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వాలని కోరగా, నిందితుడి వయసు, జైలు జీవితం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
