పెబ్బేరులో భట్టి విక్రమార్కకు ఘన సన్మానం

పెబ్బేరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి శనివారం బయలుదేరిన సందర్భంలో, ఆయన పెబ్బేరు మండలం కిష్టారెడ్డిపేట వద్దకు చేరుకోగానే స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ సాగర్, మాజీ సర్పంచ్ సురేంద్ర గౌడ్, రాములు యాదవ్, యుగంధర్ రెడ్డి, రణధీర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, శివ సాయి, డైరెక్టర్ రాములు, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, వడ్డే అంజి, రజక నరసింహ తదితరులు పాల్గొన్నారు.
