నూతన కమిషనర్‌ను సన్మానించిన జమే మస్జీద్ కమిటీ సభ్యులు

పెబ్బేరు, జూలై 15:
పెబ్బేరు మున్సిపాలిటీకి ఇటీవలగా నియమితులైన నూతన కమిషనర్ ఖాజా అరిఫోద్దీన్ను మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో జమే మస్జీద్ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కమిషనర్‌ను షలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, “పెబ్బేరు మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మున్సిపాలిటీ అభివృద్ధిలో స్థానిక ముస్లిం ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.
సన్మాన కార్యక్రమంలో జమే మస్జీద్ అధ్యక్షులు MD. అప్సర్, ఉపాధ్యక్షులు MD. మస్జీద్, MD. సిరాజుద్దీన్, MD. ఉమర్ సాహబ్, యూత్ కమిటీ అధ్యక్షుడు MD. భద్రద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
