
దుబాయ్లో చిక్కుకున్న వారికి సోనూసూద్ అండ.. ఉచిత వసతి ప్రకటన
మానవత్వాన్ని చాటుకోవడంలో ఎప్పుడూ ముందుండే సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చూపించారు. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తానని ప్రకటించారు. తమ దేశాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఎవరికైనా సరే, వారు సురక్షితంగా స్వదేశాలకు చేరుకునే వరకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. సహాయం కావాల్సిన వారు తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాలని సూచించారు. గతంలో కోవిడ్ సమయంలో వేలాది మంది వలస కార్మికులకు సహాయం చేసి ‘రియల్ హీరో’గా నిలిచిన సోనూసూద్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
