
ట్రాలీ ఢీకొని యువకుడు మృతి
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన కొలుగూరి నవీన్ (22) గురువారం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ తన టీవీఎస్ బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన అశోక్ లేలాండ్ ట్రాలీ (TS 02 UD 3156) అతివేగంగా, అజాగ్రత్తగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్‌కు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాలీని నడిపిన వ్యక్తి రాచపల్లి ప్రదీప్ (30, హుజురాబాద్) అని గుర్తించారు. మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
