
ఉద్యోగార్థులకు శుభవార్త – TGSRTCలో భారీ నియామకాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగార్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) TGSRTCలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔹 మొత్తం ఖాళీలు : 1,743
▪️డ్రైవర్లు – 1,000 పోస్టులు (జీతం రూ.20,960 – రూ.60,080)
▪️శ్రామిక్‌లు – 743 పోస్టులు (జీతం రూ.16,550 – రూ.45,030)
జిల్లాల వారీగా ఖాళీలు

డ్రైవర్లు : హైదరాబాద్ (148), రంగారెడ్డి (88), మెదక్ మల్కాజిగిరి (93), ఖమ్మం (44), నల్గొండ (31), వరంగల్ (29), హనుమకొండ (41), మహబూబాబాద్ (31), కరీంనగర్ (12), జగిత్యాల (11), నిజామాబాద్ (49), కమారెడ్డి (30), సూర్యాపేట (22), యాదాద్రి (15), సంగారెడ్డి (50), ఇతర జిల్లాలు – మొత్తం 1,000.
శ్రామిక్‌లు : హైదరాబాద్ (129), రంగారెడ్డి (77), మెదక్ మల్కాజిగిరి (81), నల్గొండ (20), ఖమ్మం (18), భద్రాద్రి కొత్తగూడెం (14), సూర్యాపేట (14), హనుమకొండ (21), ఇతర జిల్లాలు – మొత్తం 743.
దరఖాస్తు ప్రక్రియ
📅 ఆన్లైన్ దరఖాస్తులు : అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు
🌐 వెబ్సైట్ : www.tslprb.in
https://www.tgprb.in/
👉 అభ్యర్థులు తమ అర్హతలను నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నియామక ప్రక్రియ, అర్హతలు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
