టేకుమట్ల, మార్చి 8 (Zindagi9News):
వేసవి తీవ్రత మునుపటికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున టేకుమట్ల మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని MRPS జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులు, మండల పాలకులు తక్షణమే నీటి సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
అధికారుల అప్రమత్తత అవసరం:
“ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా తగిన ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ప్రతి గ్రామంలో తగిన నీటి వసతి ఏర్పాటు చేయాలి” అని ఆయన సూచించారు. టేకుమట్ల మండలంలోని అధికారులు దీనిపై త్వరగా స్పందిస్తారని ఆశిస్తున్నాం అని రామ్ రామ్ చందర్ మాదిగ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో MSF జిల్లా నాయకులు అంబాల అనిల్ కుమార్ మాదిగ, MSF టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ పాల్గొన్నారు.
— Zindagi9News 📰
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
