జమ్మికుంట మండలంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

జమ్మికుంట, ఆగస్టు 11: జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ మరియు మండలంలోని అన్ని గ్రామాల్లో నులిపురుగుల నిర్మూలన మాత్రలు (ఆల్బెండజోల్) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 44 ప్రభుత్వ పాఠశాలలు, 56 అంగన్వాడీ కేంద్రాలు, 17 ప్రైవేట్ పాఠశాలలు, 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 1 ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 2 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో పిల్లలకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు వేసి పంపిణీ చేశారు.
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డాక్టర్ చందు, డిప్యూటీ డీఎంహెచ్ఓ, హుజురాబాద్ చేతుల మీదుగా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన ఆల్బెండజోల్ మాత్రల ప్రయోజనాలను పిల్లలకు వివరించారు. మాత్రలు తీసుకోని పిల్లలకు ఈ నెల 18వ తేదీ ‘మాప్ అప్ డే’లో అందజేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్, డాక్టర్ చందన, డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ బిందు, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సంధ్య, హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, అడిదెల మోహన్ రెడ్డి, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ, కుసుమ కుమారి, సదానందం, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
