
చదువుల్లోనూ, ఆటల్లోనూ ఆణిముత్యాలను వెలికి తీయండి – ఆకునూరి మురళి
వీణవంక, నవంబర్ 13 (zindagi9news):
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో గురువారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల కార్యక్రమాలైన చల్లూరు టాక్స్, న్యూస్ ఛానల్, టి.ఈ.డి-ఈడి, ఇంగ్లీష్ క్లబ్, గార్డెన్, ఆర్ట్ క్రాఫ్ట్, ఎగ్జిబిషన్ వంటి విభాగాలను పరిశీలించి, ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులతో ముచ్చటించారు.
మండలంలోని పలు పాఠశాలల విద్యార్థుల ఎల్.ఈ.పీ మరియు ఎఫ్.ఎన్ ప్రాజెక్టులు కూడా పరిశీలించారు. అనంతరం ప్రైమరీ స్కూల్‌ను సందర్శించి, ప్రీ ప్రైమరీ విద్యార్థులతో సరదాగా సంభాషించారు.
ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఆకునూరి మురళి చెప్పారు — “విద్యార్థుల్లోని ప్రతిభను చదువుల్లోనూ, ఆటల్లోనూ వెలికి తీయాలి. వారిని జాతికి ఆభరణాలుగా తీర్చిదిద్దే బాధ్యత మనదే” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాంఖాడే, డీఈఓ శ్రీరాం మొండయ్య, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్లానింగ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డిసిఈబి భగవతయ్య, తహసిల్దార్ అనుపమ రావు, ఎంపీఓ సురేందర్, ఎంఈఓ శోభారాణి, జి.సి.ఈ.సి. కృపారాణి, హెచ్ఎం సంపత్ కుమార చారి, ఉపాధ్యాయులు, ఎం.ఆర్.సి ఇంచార్జ్ నాగిరెడ్డి, ప్రైమరీ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
