
జమ్మికుంటలో దొంగ అరెస్ట్ — ఐదు దొంగతనాల కేసులు వెలుగులోకి
జమ్మికుంట, నవంబర్ 5 (జిందగీ 9 న్యూస్):
జమ్మికుంట పోలీసులు ఐదు దొంగతనాల కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో మోతుకులగూడెం గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ ఎస్.రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆటో నంబర్ TG25 T 0229 ను ఆపి తనిఖీ చేయగా, ఆటోలో ఎరుపు రంగు గడ్డపార కనిపించింది. డ్రైవర్ విచారణలో అతను సోమ సారయ్య (58), హౌసింగ్ బోర్డు కాలనీ, జమ్మికుంట నివాసి అని తెలిసింది.
అతను 2010లో తన భార్యను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైనట్లు తెలిపాడు. జైల్లో ఉన్నప్పుడు దొంగలతో పరిచయం ఏర్పడి, బయటకు వచ్చాక తిరిగి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.
సారయ్య జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో ఐదు దొంగతనాలు చేసినట్లు పోలీసులు తెలిపారు:
1. ధర్మారం గ్రామం (16.05.2025): ఇంటి తలుపు, అల్మైరా తాళాలు విరగగొట్టి 4 తులాల బంగారం, నగదు దొంగతనం.
2. కల్యాణ్ జువెల్లర్స్ (జమ్మికుంట): షట్టర్ పగలగొట్టి 2 కిలోల వెండి, 2 తులాల బంగారం దొంగతనం.
3. కొండూరు కాంప్లెక్స్ (జమ్మికుంట): కిరాణా షాపు నుండి రూ.20,000 నగదు దొంగతనం.
4. ZPHS హైస్కూల్ (రాచపల్లి): స్కూల్ తలుపు పగలగొట్టి ల్యాప్టాప్ బ్యాగ్ దొంగతనం.
5. ఎస్.ఎల్.ఎస్. జువెల్లరీ అండ్ వర్క్స్ (జమ్మికుంట): షట్టర్ లిఫ్ట్ చేసి 5 గ్రాముల బంగారు ముక్కుపుడకలు దొంగతనం.
నిందితుడి నుండి 1.535 కిలోల వెండి ఆభరణాలు, 5 గ్రాముల బంగారం, రూ.38,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో జమ్మికుంట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
