
పాము కాటుకు యువకుడు మృతి
పెబ్బేరు: పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన గంధం రవికుమార్ (21) పాము కాటు కారణంగా మృతిచెందాడు. సమాచారం ప్రకారం, నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన వ్యవసాయ పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న రవికుమార్‌ను, పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం సుమారు 4 గంటల సమయంలో మరణించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.
