కరీంనగర్, ఫిబ్రవరి 11: మంగళవారం రోజున ఐఐటి జేఈఈ మెయిన్ 2025 (ఫస్ట్ సెషన్) ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు అద్భుత విజయాన్ని సాధించాయి. ఈ సందర్భంగా నగరంలోని వావిలాలపల్లి లోని టైనీ టాట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని వెల్లడించారు.
99+ పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య 11,
98+ పర్సంటైల్ సాధించిన విద్యార్థుల సంఖ్య 53.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు:
అనిరుద్ సాయి – 99.90 పర్సంటైల్
వమిక – 99.88 పర్సంటైల్
ఈ. అంకిత్ సాయి – 99.81 పర్సంటైల్
సాయి సుముఖ – 99.69 పర్సంటైల్
విశాల్ – 99.61 పర్సంటైల్
రిషికేష్ – 99.53 పర్సంటైల్
రామ సుమిత్ – 99.51 పర్సంటైల్
అబ్దుల్ హక్ – 99.48 పర్సంటైల్
అబ్దుల్ జిషన్ – 99.41 పర్సంటైల్
శశి ప్రీతం – 99.38 పర్సంటైల్
ఈ కార్తీక్ రెడ్డి – 99.09 పర్సంటైల్

విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఫలితం
ఈ సందర్భంగా డాక్టర్. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
“ఈ ఫలితాలు విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, మరియు ప్రత్యేక శిక్షణకు ప్రతిఫలంగా నిలిచాయి. ఈ విజయం భవిష్యత్ తరాలకు గొప్ప ప్రేరణగా మారుతుందని నేను ఆశిస్తున్నాను,” అని తెలిపారు.
విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
