బోయినిపల్లి;రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. జమ్ము కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ, మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం నాయకత్వంలో బుధవారం రోజున బోయినిపల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినారు.ఈ సందర్భంగా అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ: పహాల్గంలో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని భారతీయ జనతా పార్టీ మండలం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యను అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, సంతాపాన్ని తెలియజేస్తున్నామని, దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్తిస్తున్నాని, ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి, వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద సంస్థలను సమూలంగా తుడిచివేయాలని, ఉగ్రదాడుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మాజీ మండల అధ్యక్షులు బొంగాని అశోక్ గౌడ్, ఎస్సీ మోర్చా మాజీ మండల అధ్యక్షులు సుంకపాక ప్రభు, సీనియర్ నాయకులు కిరణ్, కందాలపు వెంకటేష్, తిప్పరవేణి శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బోగోజి గంగాధర్ చారి, మెరుపుల గంగాధర్, మోడీ నిఖిల్, నవీన్, రజనీకాంత్, ప్రసాద్, ప్రశాంత్, తిరుపతి, ఐలయ్య, అనిల్, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
