పెబ్బేరు, ఏప్రిల్ 24 (Zindagi9News):
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన అమాయక్ ప్రజలకు నివాళిగా పెబ్బేరు పట్టణంలో కొవొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారు “ఉగ్రవాదాన్ని అంతమొందించాలి”, “మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి” అనే నినాదాలతో ర్యాలీని కొనసాగించారు.
పట్టణంలోని ప్రధాన వీధుల్లో కొవొత్తులు వెలిగించి మౌనంగా నడుస్తూ, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమం సామాజిక చైతన్యానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు నేతలు పేర్కొన్నారు.
