బోయినిపల్లి, ఏప్రిల్ 23:రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ‘రాజీవ్ యువ వికాసం’ ఇంటర్వ్యూలకు నిరుద్యోగ యువతీ యువకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం కింద, మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.మొదటి రోజు ఎస్.బి.ఐ విలాసాగర్, యూనియన్ బ్యాంక్ బోయినిపల్లి శాఖ పరిధిలోని గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ల దరఖాస్తుదారులను ఇంటర్వ్యూకు పిలిపించారు. మొత్తం 730 మంది దరఖాస్తు చేసుకోగా, 492 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వారిలో అధిక శాతం నిరుపేద కుటుంబాలకు చెందిన యువతే ఉన్నారు.ఇంటర్వ్యూల నిర్వహణకు ఎంపీడీవో జయశీల సమర్థవంతమైన ఏర్పాట్లు చేశారు. సిబ్బంది నియామకం నుంచి ఇంటర్వ్యూల ప్రాంగణంలోని వసతుల వరకూ అన్నీ చక్కగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నారాయణరెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీధర్, సూపరిండెంట్ రవీందర్, ఐకెపి ఎపిఎం జయసుధ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మహేందర్, ఎస్బీఐ మేనేజర్ సురేందర్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.– Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
