ఇల్లంతకుంట : శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లంతకుంట ప్రధాన దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. మార్చి 30 వ తేదీన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు, వాహన పూజలు నిర్వహించనున్నారు.
అదే రోజు సాయంత్రం 5 గంటలకు గ్రామ దేవాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రాబోయే సంవత్సరంలోని ముఖ్య విశేషాలను తెలుసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. అనంతరం శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం – ఏప్రిల్ 6
ఏప్రిల్ 6, ఆదివారం శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. కళ్యాణదాతలుగా పాల్గొనాలనుకునే భక్తులు రూ. 3016/- లు చెల్లించి రసీదు పొందవచ్చు. కళ్యాణదాతలకు శేష వస్త్రం, స్వామివారి ఫోటో, లడ్డూ ప్రసాదం అందజేయబడుతుంది.
భక్తుల విరాళం
శ్రీ సీతమ్మవారి కోసం మంతెన కృష్ణమూర్తి విమలాదేవి (ఇల్లంతకుంట, రిటైర్డ్ తెలుగు పండిట్) భక్తిభావంతో 6.540 గ్రాముల బరువుగల బంగారు గొలుసును విరాళంగా అందజేశారు.
వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు:
📞 9393398859, 9849053111, 9849031431, 9701778717
కే. సుధాకర్, కార్యనిర్వహణ అధికారి
(Zindagi9News – ఇల్లంతకుంట)
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
