హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హుజురాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్, కమలాపూర్ బస్టాండ్, రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఉమెన్ అండర్ 19 క్రికెటర్ల ప్రోత్సాహం వంటి ప్రధాన విషయాలపై ఆయన మాట్లాడారు.
ప్రధాన డిమాండ్లు:
🔴 హుజురాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్
🔸గత ప్రభుత్వం 10 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం 20% మాత్రమే పనులు పూర్తయ్యాయి.
🔸క్రీడాకారులకు పూర్తిస్థాయిలో మైదానం అందుబాటులోకి రావడానికి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
🔴 కమలాపూర్ బస్టాండ్
🔹కమలాపూర్ బస్టాండ్ నిర్మాణానికి 1.75 కోట్లు ఖర్చయినప్పటికీ, ఇంకా పూర్తికాలేదు.
🔹నిర్మాణాన్ని పూర్తిచేయడానికి అదనంగా 1 కోటి కేటాయించాలని ఆయన కోరారు.
🔴 రైల్వే బ్రిడ్జి – బండి సంజయ్ నిర్లక్ష్యం
▪️ఉప్పల్‌లో 45 కోట్లతో రైల్వే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది.
▪️బండి సంజయ్ రెండుసార్లు ఎంపీగా గెలిచినా, ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు.
🔴 ఉమెన్ అండర్-19 క్రికెటర్లకు న్యాయం చేయాలి
◽అండర్-19 మహిళల క్రికెట్ టీమ్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచి త్రిష, క్రితి ఎంపికయ్యారు.
◽త్రిషకు 1 కోటి ప్రోత్సాహక నిధి ఇచ్చినప్పటికీ, కృతి కేవలం 10 లక్షలు మాత్రమే పొందింది.
◽కృతికి కూడా 1 కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి స్పందన ఎదురు
హుజురాబాద్ అభివృద్ధి, క్రీడాకారులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఈ డిమాండ్లు ఉంచిన పాడి కౌశిక్ రెడ్డి… దీనిపై ప్రభుత్వ తక్షణ స్పందన ఆశిస్తున్నారు.
