
ఆశ కార్యకర్త కుటుంబానికి ఆరోగ్యశాఖ ఆర్థిక చేయూత
జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తనుగుల గ్రామ ఆశా కార్యకర్త సంపూర్ణ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటనపై వైద్యాధికారి, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి స్వచ్ఛందంగా రూ.45,500 నగదు సహాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సహాయం కుటుంబానికి కొంత ఊరట ఇస్తుందని వైద్యాధికారి డాక్టర్ వరుణ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్ అరుణ, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, ఏఎన్ఎంలు రమ, మనీ, ఆశా కార్యకర్తలు దీపిక, పుష్ప తదితరులు పాల్గొన్నారు.
