నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన ఆకాష్ (25) ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆకాష్ బెట్టింగ్ యాప్‌లో మూడు లక్షల రూపాయలు పెట్టి నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా క్షీణించడంతో మానసిక ఒత్తిడికి గురైన ఆకాష్, పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆకాష్‌కు భార్య, ఐదు నెలల బాబు ఉండగా, గత నాలుగు నెలలుగా బెట్టింగ్ వ్యసనంలో పడిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆన్లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
