
అల్ఫోర్స్ విద్యార్థిని రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థిని ఎం.ఈశానా (6వ తరగతి) రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైంది. ఇటీవల కరీంనగర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యోగా అసోసియేషన్ నిర్వహించిన అండర్-12 బాలికల విభాగంలో ఈశానా మూడో స్థానాన్ని సాధించింది. త్వరలో హైదరాబాద్లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో పాల్గొనడం ద్వారా మానసిక, శారీరక లాభాలు పొందడమే కాకుండా పోరాటపటిమను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడలలో ఆసక్తి చూపి వివిధ స్థాయిల్లో సత్తా చాటాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
