
జమ్మికుంట, మే 21 (zindagi9news) : జమ్మికుంట మండలం కోరపల్లి లో బుధవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో ‘అమ్మ మాట – అంగన్వాడి బడిబాట’ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జి. రమాదేవి, ఎన్జీవో నితీష్ మాట్లాడుతూ… అంగన్వాడి కేంద్రాలు ప్రీ-స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసిందని, లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేస్తోందన్నారు.
రెండున్నర సంవత్సరాల వయస్సు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్యను అందిస్తూ, బాలమృతం, పాలు, గ్రుడ్లు, కురుకురే వంటి ఆహార పదార్థాలను ప్రతి రోజూ ఉచితంగా అందించడమవుతున్నదని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించి వారి భవిష్యత్తును చక్కదిద్దడంలో భాగస్వాములవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ రమాదేవితో పాటు అంగన్వాడి టీచర్లు భాగ్య, రమ, తిరుమల, రజిత, ప్రీ-స్కూల్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
