హుజరాబాద్, 25 ఫిబ్రవరి: హుజురాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. “కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు, BRS ను ప్రజలు నమ్మరు. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు” అని వ్యాఖ్యానించారు.
హుజురాబాద్ తన గడ్డ అని అభివర్ణించిన రాజేందర్, హుజురాబాద్ తనకు ప్రాణభూమి అంటూ, గత ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ప్రజలను మరోసారి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. “రాజకీయాలు పూలబాట కాదు, ముల్లబాట. సమస్యల నుంచి పారిపోని వాడే నిజమైన నాయకుడు” అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ₹4 లక్షల కోట్లు కేటాయించిందని, మధ్య తరగతి కోసం ఆదాయపన్ను మినహాయింపులు కల్పించిందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వమే అవసరమని ప్రజలను బలపరిచారు.
“ఈ ఎన్నిక బీజేపీ భవిష్యత్తుకు కీలకం. కొమరయ్య, అంజిరెడ్డిలను గెలిపించండి” అని ప్రజలను కోరారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
