ఈనెల 27న జరిగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అయితే, కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఓటు హక్కు ఉన్న సిబ్బందికి కొన్ని గంటల మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో యాజమాన్యాలు ఎన్నికల అధికారుల ఆదేశాలను పాటించి పూర్తి సెలవుగా ప్రకటించాలి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.
ఈ సెలవు సాధారణ CL లకు సంబంధం లేకుండా అదనంగా ఇవ్వాలి. ఓటు హక్కును అడ్డుకుంటే బీజేపీ నాయకులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. “ఓటు హక్కును వినియోగించుకోవడం మీ హక్కు, అడ్డుకునే అధికారం ఎవరికి లేదు” అని స్పష్టం చేశారు.
