కొత్తగూడెం జిల్లా టీ ఎస్ టి డి ఎఫ్ (TSTTF) జిల్లా అధ్యక్షుడు భూక్యా మోహన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సెలవుదినంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారి కి వినతిపత్రం సమర్పించారు.అదేవిధంగా,కులగణన సర్వే చేసిన ఉపాధ్యాయులకు రెన్యూమిరేషన్ తో పాటు 5 రోజుల CCL మంజూరు చేయాలని TOSS 2022 – 2024 మధ్యకాలంలో వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ELS మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి S. బాలకృష్ణ చోహన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా బాబులాల్ నాయక్, కార్యదర్శి బావురావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
