
పెబ్బేర్, వనపర్తి జిల్లా(zindagi9news): పెబ్బేరు మండలంలోని సూగూర్ గ్రామంలో మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను ముస్లిం మహిళలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళ నయ్యర్ బేగంకు కుట్టు మిషన్ను పెబ్బేర్ మార్కెట్ డైరెక్టర్ నరసింహనాయుడు ఆధ్వర్యంలో అందజేశారు.
ఈ కార్యక్రమం లో పెబ్బేర్ మార్కెట్ డైరెక్టర్ నరసింహనాయుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సూగూర్ గ్రామ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ అధ్యక్షుడు రామ లక్ష్మణ్, మండగిరి రాముడు, సర్దార్, అబ్దుల్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, మైనారిటీ మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, వృత్తిపరమైన సాధనాల పంపిణీతో వారు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవచ్చని తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చొరవతో ఈ మిషన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
