సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ కార్తీక్

జమ్మికుంట : ఆగస్టు 19 (జిందగీ9న్యూస్)
జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నాగంపేట గ్రామంలో ఈరోజు వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 41 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు.
శిబిరంలో 4 మంది జ్వరపీడితులను గుర్తించి, వారి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కి పంపించారు. ఈ సందర్భంగా డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి గ్రామస్తులకు సీజనల్ వ్యాధుల వ్యాప్తి, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని సూచించారు.
అదే విధంగా అసంక్రమిత వ్యాధులు మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలపై గ్రామస్తులకు వివరించి, సరైన ఆహార అలవాట్లు పాటించాల్సిన అవసరాన్ని తెలిపారు. 13 సంవత్సరాల పైబడిన మహిళలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రతి మంగళవారం, శుక్రవారం జరిగే ఆరోగ్య మహిళా శిబిరాలకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
ఈ కార్యక్రమములో డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, రామక్రిష్ణ ల్యాబ్ టెక్నీషియన్ నరేందర్ హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎంలు శ్రీముఖి, తిరుమల,నాగంపేట కార్యదర్శి అంకుస్,కారోబార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
