హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ నేతృత్వంలో గురువారం రోజున జరిగిన కార్యక్రమంలో మొత్తం 183 లబ్ధిదారులకు రూ.76 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ చెక్కులు హుజురాబాద్ పట్టణం సహా 5 మండలాలు, 2 పట్టణాలకు చెందిన లబ్ధిదారులకు అందజేయబడ్డాయి.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ,
“పేద కుటుంబాలు ఆసుపత్రుల పాలవుతుంటే వారి చికిత్స ఖర్చులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తున్నాం. వారు వాటిని వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి.”
ప్రణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటివరకు రూ.1,500 కోట్ల పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పంపిణీ చేసినట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయం లేకుండా అర్హులైన వారందరికీ సాయం అందేలా చూస్తున్నామని తెలిపారు.
చెక్కుల వెంటనే రావడానికి పార్టీ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు వెంటనే పంపిస్తూ తాము నిరంతరం కృషి చేస్తున్నట్టు ప్రణవ్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
