శ్రావణ శుక్రవారం ఘనంగా.. శ్రీ విశ్వేశ్వర ఆలయంలో మహిళా భక్తుల నైవేద్యం, పూజా కార్యక్రమాలు
జమ్మికుంట బొమ్మలగూడి లోని పురాతన శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు, అన్నపూర్ణ సేవా సమితి మరియు భవాని భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి, మహాదేవునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం సమయానికి అమ్మవారికి ప్రీతికరమైన కదంబ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు.
మహిళలు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం మరియు శివ చాలీసా పారాయణం చేసి ధర్మపరమైన ఆరాధనలో తలమునకలయ్యారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు.
భక్తులు శ్రావణ శుక్రవారాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
