
వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
జమ్మికుంట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీకేఎస్పీ జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జమ్మికుంటలోని సత్యసాయి మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ విడియాల సావిత్రిని, అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముందుండి యువతను ఆధ్యాత్మిక చింతన వైపు నడిపిస్తున్న చందా పారిజాతం, గన్ను విశాలక్ష్మి, రామిని భాగ్యలక్ష్మిలను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుండా రాజేంద్రప్రసాద్ , వీ107ఏ వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, క్లబ్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
