గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం

గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌ల మధ్య ఉండే వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. సరఫరాలో పారదర్శకత తీసుకురావడం, అక్రమ విక్రయాలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే LPG ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సరఫరాలో గృహావసర సిలిండర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కూడా సూచించింది.
