పెబ్బేరు, ఏప్రిల్ 24 (Zindagi9News):పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రముఖ ప్రాంతం వివేకానంద సర్కిల్, ప్రస్తుతం చెత్త కుప్పగా మారి తీవ్ర దుర్వాసనను వెదజల్లుతోంది. ఈ సర్కిల్ ఎదురుగా మున్సిపాలిటీ సిబ్బంది చేత్తా వేయడంతో స్థానికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.చెత్తను రోడ్డు పక్కన, పంట పొలాల్లో పడేసిన దృశ్యాలు గమనించగలిగేలా ఉన్నాయి. దీని వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నడిచే పాదయాత్రికులు, పక్కన నివాసం ఉండే కుటుంబాలు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతున్నారు.”ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది ఉన్నా కూడా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దయచేసి మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలి,” అని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.పెబ్బేరు పట్టణ శుభ్రతకు ప్రజలు కూడా సహకరించాలనే సూచనలతో పాటు, చెత్త వ్యవస్థపై పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
