
విద్యుత్ వినియోగదారులకు శుభవార్త: ఇక వాట్సాప్‌లోనే విద్యుత్ సేవలు!
హైదరాబాద్ :
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారుల కోసం సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, సేవల విభాగంలో మరింత పారదర్శకత కోసం తాజాగా వాట్సాప్ చాట్‌బాట్ (WhatsApp Chatbot) సేవలను ప్రారంభించింది.
గతంలోనే కాల్ సెంటర్లలో ఏఐ (AI) వాయిస్ బాట్లను ప్రవేశపెట్టిన సంస్థ, ఇప్పుడు సామాన్యులకు సైతం సులభంగా ఉండేలా వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పించింది.
సౌకర్యాలు ఇవే:
వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో 8712441912 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘హాయ్’ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ కింది సేవలను పొందవచ్చు:
* ఫిర్యాదుల నమోదు: విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, మీటర్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు.
* స్టేటస్ ట్రాకింగ్: మీ ఫిర్యాదు ఏ దశలో ఉంది? ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో స్వయంగా తెలుసుకోవచ్చు.
* బిల్లుల వివరాలు: బిల్లు చెల్లింపులు, అధిక బిల్లులు, బిల్లుల జారీలో ఆలస్యం వంటి సమాచారాన్ని పొందవచ్చు.
* విద్యుత్ కోతలు: మీ ప్రాంతంలో విద్యుత్ కోతలు ఎప్పుడు ఉన్నాయనే వివరాలను కూడా తెలుసుకునే వీలుంది.
సైబర్ నేరగాళ్లకు చెక్:
“మీ కరెంట్ బిల్లు పెండింగ్‌లో ఉంది.. వెంటనే చెల్లించకపోతే రాత్రికి కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ వచ్చే నకిలీ మెసేజ్‌ల పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. అటువంటి మోసపూరిత లింకులను నమ్మి మోసపోకుండా, అధికారిక వాట్సాప్ నంబర్ ద్వారా వాస్తవాలను సరిచూసుకోవాలని ఆయన కోరారు.
ఈ వినూత్న సేవ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా వేగంగా మరియు సులభంగా విద్యుత్ సంబంధిత సమాచారాన్ని పొందే అవకాశం కలిగింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
