
వికేఎస్పి జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జమ్మికుంట: వికేఎస్పి జమ్మికుంట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం జమ్మికుంట పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుండా రాజేంద్రప్రసాద్, కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్, జోన్ చైర్పర్సన్ అయితు రమేష్, వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్ పాల్గొన్నారు. అలాగే ఆఫీసర్లు అయిత సుధాకర్, రావి కంటి నీలకంఠం, సుద్దాల శ్రీనివాస్‌తో పాటు క్లబ్ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
