
కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్కు చేరిక – జమ్మికుంట రాజకీయాల్లో చర్చ
జమ్మికుంట: జమ్మికుంట పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సురంజన్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు కారణమయ్యారు. 19 జనవరిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో డాక్టర్ సురంజన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొంటూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని అప్పట్లో డాక్టర్ సురంజన్ వ్యాఖ్యానించారు.
అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే డాక్టర్ సురంజన్ తన రాజకీయ వైఖరిని మార్చుకున్నారు. 27 జనవరిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధికారికంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోతుందని, జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులే లేకపోవడం పార్టీ బలహీనతకు నిదర్శనమని విమర్శించారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని డాక్టర్ సురంజన్ ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతోనే బిఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.డాక్టర్ సురంజన్ పార్టీ మార్పు జమ్మికుంట మున్సిపల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారగా, మున్సిపల్ ఎన్నికల ముందు ఈ పరిణామం కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
