తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఫిబ్రవరి 11న పోలింగ్.. 13న ఓట్ల లెక్కింపు

తెలంగాణలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన 2వ సాధారణ ఎన్నికల షెడ్యూల్–2026ను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు ఇవే:
🔹ఎన్నికల నోటిఫికేషన్ & నామినేషన్ల ప్రారంభం: జనవరి 28
🔹నామినేషన్ల చివరి తేదీ: జనవరి 30 (సాయంత్రం 5 గంటల వరకు)
🔹నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ): జనవరి 31
🔹అర్హులైన అభ్యర్థుల జాబితా విడుదల: జనవరి 31
🔹అపీల్స్కు చివరి తేదీ: ఫిబ్రవరి 1
🔹అపీల్స్ పరిష్కారం: ఫిబ్రవరి 2
🔹నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఫిబ్రవరి 3 (మధ్యాహ్నం 3 గంటల వరకు)
🔹తుది అభ్యర్థుల జాబితా విడుదల: ఫిబ్రవరి 3
🔸పోలింగ్: ఫిబ్రవరి 11 (ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు)
🔸రీ–పోలింగ్ (అవసరమైతే): ఫిబ్రవరి 12
🔸ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 13 (ఉదయం 8 గంటల నుంచి)
🔸ఫలితాల ప్రకటన: కౌంటింగ్ పూర్తయ్యాక
ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
