కరీంనగర్, ఫిబ్రవరి 6 :కరీంనగర్ వాగ్దేవి వనిత క్లబ్ అధ్యక్షతలో గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సారే సమర్పణ చేశారు. స్థానిక గంజి మార్కెట్ లోని వినాయక ఆలయంలో సారె సిద్ధం చేసుకుని అక్కడినుండి చప్పుళ్లతో టవర్ సర్కిల్ మీదుగా వెంకటేశ్వర ఆలయానికి సారె తో ఊరేగింపుగా వెళ్లారు.ఆలయ ఆవరణలో సారే సంబంధిత వస్తువులు అన్నింటిని ఒకచోట ఉంచి భక్తిశ్రద్ధలతో భజన కార్యక్రమాన్ని చేపట్టారు.పూలు, పండ్లు, చకినాలు,భక్ష్యాలు లడ్డూలు ఇతర మిఠాయిలు, మొదలైన సారే సామాగ్రిని ఆలయ పూజారులకు అందజేశారు..కార్యక్రమం లో వాసవి క్లబ్ ఐపిసి జంద్యం మధుకర్,రీజన్ చైర్మన్ పాత రాధా కిషన్, డిస్టిక్ ఇన్చార్జ్ అవేర్నెస్ అక్కినపల్లి నాగరాజు, జోన్ చైర్పర్సన్ మాడిశెట్టి ఉమాదేవి, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.వాగ్దేవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ రూపశ్రీ, వి. రాజమణి,వాగ్దేవి క్లబ్ కోశాధికారి గంప హరిణి , వైస్ వైస్ ప్రెసిడెంట్లు విశాల,లావణ్య, సుప్రియ మరియు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
