వరంగల్ జిల్లా ఇనుగుర్తి మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ కుటుంబంతో సహా కారులో ప్రయాణిస్తుండగా, సంగెం మండలం తీగరాజుపల్లి సమీపంలో ఎస్సారెస్పీ కాలువ లోకి ప్రమాదవశాత్తు కారు పడిపోయింది.ఈ ప్రమాదంలో ప్రవీణ్ కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య కృష్ణవేణిని గ్రామస్తులు రక్షించారు. అయితే, తండ్రి, కూతురు ఇంకా గల్లంతయ్యారు. స్థానికులు, రక్షణ దళాలు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలమించాయి. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
