జమ్మికుంటలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం (బొమ్మల గుడి) లో లోక కళ్యాణార్ధం తలపెట్టిన “శివ పంచాక్షరి జప మహోత్సవం” ఘనంగా జరిగింది. భక్తుల అంకితభావంతో ఐదు కోట్ల శివ పంచాక్షరి జపం పూర్తిచేయబడింది.

ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పంచామృతాలతో రుద్రాభిషేకం ఆలయ అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తుల నినాదాలతో ఆలయం మారుమోగింది.

ఈ కార్యక్రమం అన్నపూర్ణ సేవా సమితి మరియు భవాని భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. వేలాది మంది భక్తులు పాల్గొని శివుని కృపకు పాత్రులయ్యారు.
అంతేగాక, భక్తజన సమూహం మధ్య అన్నపూర్ణ సేవా సమితి వారు అన్న ప్రసాద వితరణ నిర్వహించి, ఈ మహోత్సవాన్ని మరింత శోభాయమానం చేశారు.
“ఓం నమః శివాయ” నినాదాలతో ఆలయ ప్రాంగణం శివమయంగా మారింది.
