టేకుమట్ల, ఫిబ్రవరి 1: టేకుమట్ల మండల కేంద్రంలో టేకుమట్ల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణికుంట్ల శంకర్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ ల ఆధ్వర్యంలో శనివారం కరపత్రం ఆవిష్కరించారు.
టేకుమట్ల మండలంలోని మాదిగలకు టేకుమట్ల మండల ఫోరమ్ అధ్యక్షులు సంగి రవి 50 డప్పులు బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా భూపాలపల్లి జిల్లా ఎమ్మార్పీఎస్ & ఎంఎస్పి ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ కోసం లక్ష డబ్బులు వెయ్యి గొంతుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమనికి ఫిబ్రవరి 7వ తారీకున హైదరాబాదులో జరగబోయే సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకులు అందరూ దళిత బిడ్డలందరూ ఈ సభకు ప్రతి ఒక్కరు డప్పు చేత పట్టుకొని అధిక సంఖ్యలో ఈ సభను ప్రపంచం తిలకించేలా సర్కారు దిగివచ్చి వర్గీకరణను అమలు చేసే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మన మాదిగ బిడ్డ మాజీ ఎంపీటీసీ ల మండల ఫోరమ్ అధ్యక్షులు సంగి రవి తన వంతు 50 డప్పులు కొనిస్తానని ముందుకు రావడం మన గౌరవకారణం అతనికి ఎమ్మార్పీఎస్ మండల నాయకులు శాలువాతో సన్మానం చేశారు .ఈ కార్యక్రమం లో AYS జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ , MRPS జిల్లా నాయకులు రేణుకుంట్ల సంపత్ మాదిగ, MSP జిల్లా నాయకులు కన్నూరి సారయ్య మాదిగ, అక్కల రాజయ్య మరియు MRPS మండల ప్రధానకార్యదర్శి ఇల్లందుల శంకర్ మాదిగ, MRPS మండల ఉపాధ్యక్షులు బోయిని కిష్టయ్య మాదిగ, MSP మండల ప్రధానకార్యదర్శి అంబాల సారయ్య మాదిగ , MSP మండల ఉపాధ్యక్షలు అక్కల భద్రయ్య మాదిగ,MRPS టేకుమట్ల టౌన్ అధ్యక్షులు మచ్చ సరోత్తమ్ మాదిగ, వెలిశాల MRPS గ్రామశాఖ అధ్యక్షులు బోయిని శ్రీకాంత్ మాదిగ MRPS నాయకులు బోయిని రజినీకాంత్ మాదిగ సిరికొండ సాంబయ్య మాదిగ అంబాల మూగయ్య మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ ఇల్లందుల సుమన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
