కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం..
మాట ఇచ్చాం,నెరవేర్చుకున్నం.
దళిత బంధు నిధులు రాకుండా ఆపింది కౌశిక్ రెడ్డి.
నిధుల విడుదలకు కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందని,దళిత బంధు నిధుల విడుదల ద్వారా మరోసారి అది రుజువైందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శనివారం రోజున ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లు ఎమ్మెల్సీగా,ప్రభుత్వ విప్ గా ఉన్న కౌశిక్ రెడ్డి దళిత బంధు నిధులు విడుదల చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.దళితుల భావోద్వేగాలను రెచ్చగొట్టి దళితులతో దళిత బంధు రాజకీయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు దళిత బంధు నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులకే నిధులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కేసీఆర్,కేటీఆర్ కు దగ్గర అని చెప్పుకొని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని,ప్రభుత్వ పథకాలపై కౌశిక్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మార్చ్ 31 వరకు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కౌశిక్ రెడ్డి ఓర్వలేకపోతున్నాడని,తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ లు పెట్టడం కాదని ప్రజల వద్దకు వెళ్తే వారే కౌశిక్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
