నాగరం, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ( ఏప్రిల్ 21):
సిసి రోడ్ పనికి సంబంధించిన రూ.11 లక్షల పెండింగ్ బిల్లులు ఆమోదించేందుకు అధికారిక అనుమతి కోసం ఫిర్యాదుదారుని చేత రూ.1,30,000 లంచం డిమాండ్ చేసిన నాగరం పురపాలక కార్యాలయ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు సుదర్శనం రఘు, వర్క్ ఇన్స్పెక్టర్లు (ఔట్సోర్సింగ్) వి. రాకేష్, వి. సురేష్ లు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారుని సమాచారం మేరకు, ఈ ముగ్గురు కలిసి బిల్లులపై సంతకం చేసేందుకు రూ.1.30 లక్షలు లంచంగా డిమాండ్ చేశారు. ఇందులో ఒక లక్ష రూపాయలను తీసుకుంటుండగా, తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వీరిని పట్టుకున్నారు.
ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ అభివృద్ధి పనులను అడ్డుకుంటూ లాభదాహకంగా మార్చుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
