
రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు – మునిసిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్
జమ్మికుంట మునిసిపాలిటీ పరిధిలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద ఇరువైపులా ఉన్న షాపులు ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా పర్యవేక్షించాలని మునిసిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ సూచించారు. రోడ్లపై అక్రమంగా విస్తరించిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, అవసరమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
శనివారం కమిషనర్ బ్రిడ్జి క్రింద ఇరువైపులా షాపుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మునిసిపల్ ఇంజినీర్, సానిటరీ ఇన్స్పెక్టర్, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి రోజువారీ పర్యవేక్షణ నిర్వహించి, షాపులు రోడ్డు మీదకు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ వికాస్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, టీపీబీఓ దీపిక, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మాధవ్, రామరాజుతో పాటు పారిశుధ్య జవానులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
