
జమ్మికుంటలో యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిప్యూటీ DMHO డాక్టర్ చందు
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గకాలనీ అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం (UIP) కార్యక్రమాన్ని శనివారం డిప్యూటీ డీఎంహెచ్ఓ హుజురాబాద్ డాక్టర్ చందు పరిశీలించారు. వ్యాక్సినేషన్ విధానాన్ని, రికార్డులను పరిశీలన చేసి, వ్యాక్సిన్ కోసం వచ్చిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు.
పిల్లలకు వ్యాక్సినేషన్‌ను షెడ్యూల్ ప్రకారం సరైన సమయంలో వేయించడం ఎంతో ముఖ్యం అని ఆయన సూచించారు. వ్యాక్సిన్ వలన చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
తదుపరి, అంగన్వాడీ కేంద్రంలో ఉన్న SAM, MAM పిల్లలను పరిశీలిస్తూ వారి వయసుకు తగ్గ బరువు, ఎత్తు లు సరిగా ఉండేలా చూడాలని, పిల్లలకు పౌష్టికాహారం అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ మహోన్నత పటేల్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, ఏఎన్ఎంలు మంజుల, రజిత, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.
