జమ్మికుంటలో రైలు ప్రమాదం: ఇద్దరు వలస కూలీలు దుర్మరణం

జమ్మికుంట, ఆగస్టు 6: జమ్మికుంట రైల్వే గేట్ వద్ద జరిగిన విషాదకర రైలు ప్రమాదంలో ఇద్దరు వలస కూలీలు దుర్మరణం చెందారు. మద్యప్రదేశ్ రాష్ట్రం చిఖిలి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ (వయసు 25) మరియు మహారాష్ట్ర సీతపూర్ గ్రామానికి చెందిన ఆకలేష్ శ్రీరాం వార్ఖడే (వయసు 25) ఇవాళ తెల్లవారుజామున ట్రాక్ పై మరణించినట్టు రెైల్వే పోలీసులు తెలిపారు.
వీరు జమ్మికుంటలోని ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో కూలీలుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిన్న రాత్రి వారు బ్రిక్స్ కంపెనీ నుండి ట్రాక్ వైపు వెళ్లగా, అనూహ్యంగా ఒక రైలు బండిని గమనించ లేకపోయి ప్రమాదవశాత్తూ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు.
మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయగా, ఈరోజు సాయంత్రం వారు వచ్చి మృతులను గుర్తించారు. ఈ ఘటనపై రామగుండం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ జి. తిరుపతి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ దుర్ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.
