
జూలూరుపాడు, మే 15 (zindagi9news రిపోర్టర్ రాము నాయక్) : జూలూరుపాడు మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ గురువారం ఉదయం 7:30 గంటలకే పరిశీలించారు. మాచిపేటలో ఇంకుడు గుంతలు, గొపా తండాలో రైతు బాల్య మునగ తోట, దండుమిట్ట తండాలో క్యాటిల్ షెడ్డు నిర్మాణాలను పరిశీలించారు. మునగ తోటలో పండిన కాయలను చూసి కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మునగ పంట వల్ల రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారని పేర్కొన్నారు.
ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉందని సూచించారు. క్యాటిల్ షెడ్డు గురించి రైతు తెలిపిన వివరాలను ప్రశంసించారు. అవసరమైతే సాంకేతిక సలహాలు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.
పర్యటనలో ప్రజలు కలెక్టర్ దృష్టికి “ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదు, లిస్టులో పేర్లు లేవు” అని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ – అర్హుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అందరికీ ఒకేసారి ఇండ్లు ఇవ్వడం సాధ్యం కాదని, తొలి దశలో కొందరికి, తరువాతి దశల్లో మరికొందరికి ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
