
హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలపై అభ్యర్థులకు అవగాహన
హుజురాబాద్:హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 30 వార్డులకు చెందిన 143 మంది అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల జనరల్ అబ్జర్వర్, అదనపు కలెక్టర్ జి. జితేందర్ రెడ్డి (ఐఏఎస్) మాట్లాడుతూ, ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే SST, VST బృందాల ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అభ్యర్థులు ప్రచారం సమయంలో రూ.10 వేలకన్నా ఎక్కువ నగదు ఉంచుకోరాదని, మొత్తం ఎన్నికల ఖర్చు రూ.లక్ష వరకు మాత్రమే బ్యాంకు ఖాతా ద్వారానే చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఇతర అభ్యర్థుల వాల్ పోస్టర్లపై పోస్టర్లు లేదా ఫ్లెక్సీలు అతికించరాదని హెచ్చరించారు.
ఈ సదస్సులో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వై.మనోహర్, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, అసిస్టెంట్ ఎలక్షన్ అబ్జర్వర్లు మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, ముంజల శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
