డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాజీవ్ యువ వికాసం పథకంపై ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథక లబ్ధిదారుల ఎంపికను నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం పారదర్శకంగా పూర్తిచేయాలని సూచించారు. అలాగే జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి మంజూరు పత్రాల పంపిణీకి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
