రాంగ్ రూట్లో వచ్చిన కారు ఢీకొని ప్రమాదం – ముగ్గురికి గాయాలు
పలాస అమ్మవారి దర్శనానికి వెళుతున్న సమయంలో విషాదం
విశాఖపట్నం, గాజువాక, మే 25 (zindagi9news):
పలాసలో అమ్మవారి దర్శనానికి వెళుతున్న కుటుంబంపై ఘోర ప్రమాదం జరిగింది. గాజువాక పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన కళ్యాణి కుటుంబ సభ్యులు ఆటోలో విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళుతుండగా, అక్కయ్యపాలెం వద్ద రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో భాస్కర్ రావు, వరలక్ష్మి, కాశిరావులకు తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. గాయపడినవారిని వెంటనే కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రాఫిక్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

