టేకుమట్ల: టేకుమట్ల మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు, పార్టీ వీరాభిమాని పండుగ అనిల్ మృతిపట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
మంగళవారం ఉదయం అనిల్ అకాలమృతిచెందగా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (GSR) కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అతని అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA GSR స్వయంగా ప్యాడ మోసి అనిల్‌కు ఘన నివాళులు అర్పించారు.
అనిల్ మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, “అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని ఎమ్మెల్యే GSR భరోసా ఇచ్చారు.
ఈ అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు వందలాదిగా పాల్గొని అనిల్‌కు కన్నీటిపూర్వక నివాళులు అర్పించారు.
