వనపర్తి జిల్లా, వెలటూర్: ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు ధర్మవీర్ శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా వెలటూర్ గ్రామ యువకులు క్రొవ్వొత్తులతో శతకోటి పాదాభివందనాలు అర్పించారు.
ఇస్లామిక్ మోఘల పాలకులకు వ్యతిరేకంగా ధర్మ యుద్ధం చేసిన వీరయోధుడు శంభాజీ మహారాజ్ తన చివరి శ్వాస వరకు “నా కంఠంలో ప్రాణమున్నంత వరకూ నేను హిందువునే” అంటూ ధైర్యంగా పోరాడి అమరుడయ్యారు. మోఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాలపై శంభాజీ మహారాజ్‌ను హతమార్చినప్పటికీ, ఆయన ధైర్యం, త్యాగం యుగయుగాల వరకు గుర్తుండిపోతాయని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ యువత శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ధూప దీపాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
— Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
